శ్రీకోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించిన టీటీడీ

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లతో పాటు అలాగే ఒంటిమిట్ట ఆలయ పోస్టర్లను పోస్టర్లు, ఆలయ చరిత్ర తెలియజేసే కరపత్రాలను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడు, జేఈఓ శ్రీ వి. వీరబ్రహ్మంతో కలిసి ఆలయం ముందు ఆవిష్కరించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 6న శ్రీరామనవమి – పోతన జయంతి, ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. అలాగే వివిధ వాహన సేవల వివరాలను సైతం వెల్లడించారు. ఏప్రిల్‌ 9న హనుమంత వాహనం, ఏప్రిల్‌ 10న గరుడవాహనం, ఏప్రిల్‌ 11న శ్రీసీతారాముల కల్యాణం, ఏప్రిల్‌ 12న రథోత్సవం జరుగనున్నాయని తెలిపారు. ఈ ఉత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.

Share this post with your friends