శ్రీకపిలేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. బ్రహ్మోత్సవాలు ఈ నెల 28 వరకూ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముందు ఫిబ్రవరి 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుందని అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 28 వరకు శ్రీకపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి జరుగనున్న సందర్భంగా ఆలయంలో పుష్కరిణిని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
ఆకర్షణీయంగా పెయింటింగ్, రంగోళీలు, స్వామివారి వాహనాల మరమ్మత్తులు, పెయింటింగ్, విద్యుత్ కాంతులు, ఫ్లెక్సీలు, పటిష్టంగా క్యూలైన్లు, తిరుపతి నగరంలోని ప్రధాన కూడళ్లలో ఆర్చ్ లు ఏర్పాటు చేయాలని అధికారులకు టీటీడీ జేఈవో సూచించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు వేసవి నేపథ్యంలో చలువ పందిళ్లు, తాగునీరు, అన్నప్రసాదాలు అందించేందుకు వీలుగా సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు. పెండింగ్ పనులు ఉంటే తక్షణలు అనుమతులు తీసుకుని భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అంతకుముందు ఫుష్కరిణి క్లీనింగ్ ను, క్యూలైన్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.