టీటీడీ శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు విరాళం

హైదరాబాద్ కు చెందిన శ్రీ శ్రీనివాస అనిదృత్ అనే భక్తుడు బుధవారం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తరపున ఆయన ప్రతినిధి శ్రీ వై.రాఘవేంద్ర తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సీహెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను విడతల వారీగా తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేస్తోంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జూన్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

21న ఆర్జిత సేవా టికెట్లు: కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను జూన్ 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
21న వర్చువల్ సేవల కోటా : వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను జూన్ 21న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదలవుతాయి.
23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు: అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూన్ 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

Share this post with your friends