
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సీఆర్డీఏ పరిధిలోని వేంకటపాలెంలో శనివారం సాయంత్రం జరుగనున్న శ్రీనివాస కళ్యాణోత్సవానికి ఆహ్వానం పలుకుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడును తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్.నాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు, టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకన్న చౌదరి ఆహ్వానం పత్రికను అందజేశారు. ఏపీ రాష్ట్ర హెఆర్డీ , ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ను ఆహ్వానించారు.
అనంతరం రాష్ట్ర హెఆర్డీ, ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్‌ను శ్రీనివాస కళ్యాణోత్సవానికి ఆహ్వానిస్తూ టీటీడీ ఛైర్మన్, బోర్డు సభ్యులు ఆహ్వానం పత్రికను అందజేశారు. అంతకుముందు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు, హెఆర్డీ, ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ కు శ్రీవారి తీర్థప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ, శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, శ్రీ ఎం ఎస్ రాజు, శ్రీ నన్నపనేని సదాశివరావు, శ్రీ ముని కోటేశ్వరరావు, శ్రీ ఆర్ ఎన్ దర్శన్, శ్రీ ఎం.శాంతారామ్, శ్రీ తమ్మిసెట్టి జానకి దేవి, శ్రీమతి సుచిత్ర ఎల్లా, శ్రీ ఎస్ నరేష్ కుమార్ పాల్గొన్నారు.
