భక్తి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన అవసరం లేదు. భక్తి అనేది ఒక పవిత్రమైన భావన. భగవంతునిపై భక్తి భావనతో మెలిగేవారిని భక్తులని అంటారు. భగవద్గీతలో దీని గురించి వివరించడం జరిగింది. భక్తి అనే దానికి వివిధ మార్గాలున్నాయి. అంటే భగవంతుని చేరుకునేందుకు ఒకటి కాదు.. రెండు కాదు.. తొమ్మిది మార్గాలున్నాయి. భగవంతుని చేరుకోడానికి నారద భక్తి సూత్రాలు పలు రకాల భక్తి విధాల గురించి పేర్కొన్నది. భగవంతుడి వద్దకు భక్తుడి దగ్గరకు చేర్చే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బమ్మెర పోతనామాత్యుడు రచించిన భాగవతంలో ఈ నవవిధ భక్తి మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ భక్తి మార్గాలను భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో పోతన వివరించారు.. భగవంతుడిని చేరుకునేందుకు ఉన్న తొమ్మిది మార్గాలేంటో తెలుసుకుందాం. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాడ సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదన. భగవంతుని పట్ల అత్యంత భక్తి శ్రద్ధలు కలిగి ఉండి… భగవంతుడిని చేరుకోవాలన్న లక్ష్యం ఉన్నవారు ఈ నవ విధ భక్తి మార్గాలలో ఒకదానిని ఎంచుకుని ఆదరిస్తే ఫలితం కలుగుతుందట.