ఫిబ్ర‌వ‌రి 28న అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో ఫిబ్ర‌‌వ‌రి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. ఇక్కడ శ్రీ సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

ఫిబ్ర‌వ‌రి 2న మాఘపౌర్ణమి సందర్భంగా కూపు చంద్రపేట ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.

ఫిబ్ర‌వ‌రి 7, 14, 21, 28వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంట‌లకు ఊంజ‌ల సేవ‌, సాయంత్రం 5.30 గంట‌ల‌కు తిరుచ్చి ఉత్స‌వం నిర్వ‌హిస్తారు.

ఫిబ్ర‌వ‌రి 17వ తేదీ అమావాస్య సందర్భంగా ఉదయం 8.30 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగనుంది. చేపడతారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది.

ఫిబ్ర‌వ‌రి 28న పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6.30 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

Share this post with your friends