టాయ్ ట్రైన్‌లో అమ్మవారి ఊరేగింపు.. చూపుతిప్పుకోనివ్వని దృశ్యం..

దేవీ శరన్నవరాత్రులు ముగిశాయి. అయినా ఇప్పటికీ పలు చోట్ల దుర్గాదేవి ఊరేగింపునకు సంబంధించిన వీడియోలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులో అమ్మవారు.. అలాగే అమ్మవారి ఊరేగింపు.. ఆ ప్రదేశం చూపు తిప్పుకోనివ్వదు. అదెక్కడ అంటారా? డార్జిలింగ్. అత్యంత సుందరమైన ప్రదేశం. అక్కడో టాయ్ ట్రైన్. దానిలో దుర్గామాతను ప్రతిష్టించి ఊరేగింపుగా తీసుకెళ్లి అనంతరం అమ్మవారిని నిమజ్జనం చేశారు.

పర్వత ప్రాంతమైన డార్జిలింగ్‌ చూడచక్కని ప్రదేశం. ఇక్కడ ఓ గ్రామంలో అమ్మవారిని విభిన్నంగా ట్రాయ్ ట్రైన్‌లో 12 కిలో మీటర్ల పాటు ఊరేగించిన అనంతరం నిమజ్జనం చేస్తారు. ఇది ఈనాటి సంప్రదాయం కాదు.. 111 ఏళ్లుగా ఇక్కడి స్థానికులు అమ్మవారిని పది రోజుల పాటు పూజించిన మీదట ఇలా సందడిగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. ఇక తాజాగా టాయ్‌ ట్రైన్‌లో ఊరేగింపుగా తీసుకెళ్లిన అమ్మవారు సైతం అందంగా చూపరులను కట్టిపడేస్తోంది. అత్యంత అందమైన విగ్రహం. టాయ్ ట్రైన్‌ను అందంగా అలంకరించారు. దాని నిండా భక్తులు ఎక్కి డ్యాన్సులు చేస్తూ.. సందడిగా అమ్మవారి ఊరేగింపు కొనసాగింది.

Share this post with your friends