ఆశ్వయుజ మాసం మహిమ ఏంటంటే..

నేటి నుంచి ఆశ్వయుజ మాసం ప్రారంభమైంది. ఈ మాసం త్రిమూర్తుల దేవేరులు.. లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతీదేవిలకు అత్యంత ప్రీతికరమైన మాసంగా చెబుతారు. అంతేకాకుండా పార్వతీదేవి తొమ్మిది అవతారాల్లో దర్శనమిచ్చిన మాసం కూడా ఇదే. కపిల గోవును పూజించి, పంచగవ్యములను మాత్రమే స్వీకరించి ఉపవాసం చేయాలి. పూర్ణిమ ఆచారాలు ఏంటంటే.. నారదీయ పురాణాన్ని పండితులకు తాంబూలంతో సమర్పించాలి. స్త్రీలు రాత్రి జాగరణ చేస్తే, లక్ష్మీదేవి సంతోషించి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుంది.

దీపదానం విశిష్టత..

ఆశ్వయుజ మాసంలో దీపదానం చేస్తే చాలా మంచిదట. దీపదానం విశిష్టత ఏంటంటే.. బహుళ పక్షంలో చతుర్దశి, అమావాస్య రోజుల్లో: దేవాలయాలు, మఠాలు, గృహాలు, వీధులలో దీపాలు వెలిగిస్తే పితృదేవతలు సంతృప్తి చెందుతారు. ఆశ్వయుజ మాసం విశిష్టత ఏంటంటే.. ఈ మాసంలో చేసిన పూజలు, ఆచరణలు అనంత పుణ్యఫలాలు ఇస్తాయి. శక్తిస్వరూపిణి తల్లి ఏ రూపంలోనైనా, ఏ నామంతోనైనా ఆరాధన స్వీకరిస్తుంది. కాబట్టి ఈ మాసంలో అమ్మవారికి పూజలు నిర్వహించడం వలన ఫలితం చాలా బాగుంటుందని పండితులు చెబుతున్నారు.

Share this post with your friends