ఫిబ్రవరి 17 నుంచి జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ సమీపంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 17 నుంచి 25వ తేదీ వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 10న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.

ఈ సందర్భంగా తెల్లవారుజామున వేకువ జూమున స్వామివారిని మేల్కొలిపి, అనంతరం ఆగమోక్తంగా కార్యక్రమాలు చేపడుతారు. ఉదయం 07.00 గం.ల నుండి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపడుతారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 11 గం.ల నుండి సాయంత్రం 05.00 గం.ల వరకు సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.

Share this post with your friends