తెప్ప‌పై 7 చుట్లు విహరించిన రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల‌స్వామి

కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి తెప్పోత్స‌వాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తెప్పోత్సవాల సందర్భంగా స్వామివారి ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. విద్యుద్దీపాల నడుమ తెప్పలు చూడ ముచ్చటగా ఉన్నాయి. దీనిలో భాగంగా రెండ‌వ రోజైన గురువారం స్వామివారు తెప్ప‌పై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉద‌యం 9.30 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్ల ఉత్స‌వ‌ర్ల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం జ‌రిగింది.

ఈ తెప్పోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్నారు. తెప్పోత్సవాల్లో భాగంగా పాలు, పెరుగు, తెనే, ప‌సుపు, చంద‌నంల‌తో అభిషేకం చేశారు. అనంత‌రం సాయంత్రం 5 నుండి 6.30 గంట‌ల వ‌ర‌కు తిరువీధి ఉత్స‌వం నిర్వ‌హించారు. సాయంత్రం 6.30 గంటలకు శ్రీ రుక్మిణి, స‌త్య‌భామ స‌మేత శ్రీ వేణుగోపాల‌స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై 7 చుట్లు విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఆగష్టు 08న అంటే ఇవాళ శ్రావణ శుక్రవారం రాత్రి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి 09 రౌండ్లు తెప్పలపై విహరించి భక్తులను ఆశీర్వదిస్తారు.

Share this post with your friends