
కార్వేటినగరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం మిథున లగ్నంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారు ఉదయం, సాయంత్రం వాహన సేవల్లో తరిస్తున్నారు. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి తొలిరోజున చక్రత్తాళ్వార్, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించి 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.
ఇక నిన్న ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. అలాగే రాత్రి 7 నుంచి 9 గంటల వరకూ హంసవాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. భక్తులు సైతం పెద్ద ఎత్తున ఈ వాహన సేవల్లో పాల్గొని అడుగడునా స్వామి, అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ ఆలయ నిర్వహణను ఒకప్పుడు రాజులు చూ సేవారు. అనంతర కాలంలో దీని పరిపాలనా బాధ్యతలు తిరుపతి దేవస్థానానికి అప్పగించడం జరిగింది.
