దేవేరులతో కలిసి తెప్పపై విహరించిన శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. నాలుగో రోజు ఆదివారం రాత్రి శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు తెప్పపై భక్తులకు అభయమిచ్చారు. ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. విద్యుద్దీపాలతో స‌ర్వాంగ సుంద‌రంగా అలంకరించిన తెప్పపై రాత్రి 7 గంటల నుండి 8 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ఐదు చుట్లు విహరించి భ‌క్తుల‌ను అనుగ్ర‌హించారు.

మంగళవాయిద్యాలు‌, వేదపండితుల వేదపారాయ‌ణం, అన్నమాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్ర‌ప‌ర్వంగా జరిగింది.ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. స్వామి, అమ్మవార్లు మూడుసార్లు విహ‌రిస్తూ భక్తులకు ద‌ర్శ‌న‌మిచ్చారు. మంగళవాయిద్యాలు‌, వేదపండితుల వేదపారాయ‌ణం, అన్నమాచార్య ప్రాజెక్టు క‌ళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్ర‌ప‌ర్వంగా జరిగింది. తెప్పోత్సవాలలో భాగంగా స్వామి పుష్కరిణి చుట్టూ ఏర్పాటు చేసిన దశావతారాలు, పాండు రంగడు, శ్రీ పద్మావతి శ్రీనివాసుల రూపాలు ఆకట్టుకుంటున్నాయి.

Share this post with your friends