ఎస్వీబీసీలో శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌రస్వామి క‌ల్యాణోత్స‌వం.. డేట్, టైం ఏంటంటే..

శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆల‌య అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వామివారి కల్యాణాన్ని నిత్యం నిర్వహిస్తూ ఉంటారు. ఇక మీదట ప్ర‌తి రోజు నిర్వ‌హించే స్వామివారి క‌ల్యాణాన్ని భ‌క్తుల కోరిక మేర‌కు నెల‌లో ఒక రోజు ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది. ఈ క్రమంలోనే నెలలో ఏ రోజున ప్రసారం చేయనుంది? అలాగే ప్రసార తేదీలను.. సమయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు.

ఇందులో భాగంగా జ‌న‌వ‌రి 25, ఫిబ్ర‌వ‌రి 1, మార్చి 22, ఏప్రిల్ 19, జూన్ 14, 28, జూలై 19, ఆగ‌స్టు 30, సెప్టెంబ‌రు 13, అక్టోబ‌రు 11, న‌వంబ‌రు 29, డిసెంబ‌రు 13, 27వ తేదీల‌లో శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి క‌ల్యాణోత్స‌వాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఉద‌యం 11 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కూ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయనుంది. కాబట్టి భక్తులు తేదీలు, సమయంను గుర్తు పెట్టుకోవాలని సూచించింది. సుదూర ప్రాంతాల నుండి శ్రీ‌నివాసమంగాపురం రాలేని భ‌క్తులు ఎస్వీబీసీలో స్వామివారి క‌ల్యాణాన్ని వీక్షించాల‌ని టీటీడీ కోరుతోంది.

Share this post with your friends