శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో ఫిబ్రవరి నెలలో విశేష ఉత్సవాలివే..

తిరుప‌తి శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో ఫిబ్ర‌‌వ‌రి నెల‌లో ప‌లు విశేష ఉత్స‌వాలు జ‌రుగనున్నాయి. ఈ ఆలయంలోనూ ప్రతి నెలా కొన్ని విశేష ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ ఆలయంలో ఫిబ్రవరి 6 నుంచి తెప్పోత్సవాలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 20తో అధ్యయనోత్సవాలు ముగియనున్నాయి.

– ఫిబ్రవరి 4న రథసప్తమి.

– ఫిబ్రవరి 6 నుండి 12వ తేదీ వరకు తెప్పోత్సవాలు.

– ఫిబ్ర‌వ‌రి 14, 21, 28వ తేదీల్లో శుక్రవారం నాడు శ్రీ ఆండాళ్ అమ్మవారికి, శ్రీ పుండరీకవళ్ళి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు.

– ఫిబ్రవరి 15న ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీగోవిందరాజస్వామివారికి తిరుమంజనం, ఆస్థానం నిర్వహిస్తారు-

– ఫిబ్రవరి 20న‌ అధ్యయనోత్సవాలు ముగుస్తాయి.

– ఫిబ్రవరి 26న‌ శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారికి అభిషేకం, సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు.

Share this post with your friends