
తొండమాన్‌పురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం చతుష్టార్చన, పవిత్ర సమర్పణ నిర్వహించారు. ఇందులో మూలమూర్తులు, ధ్వజస్తంభం, పరివార దేవతలకు, ఉత్సవ మూర్తులకు పవిత్రలు సమర్పించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలను అర్చకులు, వేద పండితులు నిర్వహించారు.
