
తొండమాన్పురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు గురువారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చతుష్టర్చన, పవిత్ర ప్రతిష్ట తదితర కార్యక్రమాలను నిర్వహించారు.
సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే ఆలయ అర్చకులు, వేద పండితులు ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 09వ తేదీ పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.
