ఒంటిమిట్టలో మహా సంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు ప్రారంభం

ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి వారి ఆల‌యంలో మహా సంప్రోక్ష‌ణ మ‌రియు కుంభాభిషేకం కార్య‌క్ర‌మాలు గురువారం శాస్త్రోక్తంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ మహా సంప్రోక్షణ కార్యక్రమాలు మార్చి 15 వరకూ జరగనున్నాయి. 15న ఉదయం 10.15 నుండి 11:30 గంటల వరకు వృషభ లగ్నంలో మహా సంప్రోక్ష‌ణతో ఈ కార్య‌క్ర‌మం ముగుస్తుంది. ఈ తొమ్మిది రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలను ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించనున్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆగమ సలహాదారులు మ‌రియు ప్రధాన కంక‌ణ‌బ‌ట్ట‌ర్‌ శ్రీ రాజేష్ స్వామి ఆధ్వ‌ర్యంలో గురువారం ఉదయం 7.30 గంట‌ల‌కు భ‌గ‌వ‌త్పుణ్యాహ‌ము, అగ్ని మ‌ధ‌న‌ము, యాగశాలలో వైధిక కార్యక్రమాలు, మహా కుంభ, ఉపకుంభ, చక్రబ్జా మండల, పరివార కుంభారాధనలు, ప్రధాన మూర్తి హోమములు, శ్రీ మద్రామాయణ హ‌వన ప్రారంభం, మన్మోహన శాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు చతుస్థానార్చనము, స‌హ‌స్ర‌ కళాశాదివాసం, వేదాది పారాయణం, మూర్తి హోమం, పరివార హోమములు, పూర్ణాహుతి సాత్తుమొర జరగనుంది.

Share this post with your friends