నేడు, రేపు తిరుమలకు వెళ్లేవారికి కీలక సూచన

తిరుమల తిరుపతి దేవస్థానం నేడు, రేపు తిరుమలకు వెళ్లేవారికి కీలక సూచన చేసింది. ఇదివరకే టీటీడీ ప్రకటించిన విధంగా మార్చి 3వ తేదిన చంద్ర గ్రహణం కారణంగా మార్చి 2, 3వ తేదీలలో శ్రీ మలయప్ప స్వామివారి దర్శనాలకు సంబంధించి తిరుపతిలో జారీ చేసే స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు జారీ చేయబడవు. మార్చి 2, 3వ తేదీలకు సంబంధించిన ఎస్ఎస్‌డీ టోకెన్లు ముందు రోజు అనగా మార్చి 1, 2వ తేదీల్లో జారీ చేయబడవు.

మరలా మార్చి 4వ తేది దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్‌డీ టోకెన్లను మార్చి 3వ తేదీన జారీ చేయడం జరుగుతుంది. అదే విధంగా మార్చి 3వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా రద్దు చేయడం జరిగింది. ఈ కారణంగా మార్చి 2వ తేదీన వీఐపీ దర్శన సిఫార్సు లేఖలు స్వీకరించబడవని భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు సహకరించాలని కోరింది.

Share this post with your friends