Kedar, Badrinath Temple Board’s key decision : కేదార్‌, బద్రీనాథ్‌ ఆలయ బోర్డ్‌ కీలక నిర్ణయం…ఇకపై వారికి ఆలయంలోకి నో ఎంట్రీ

సనాతన ధర్మ పరిరక్షణ దిశగా కేదార్‌నాథ్, బద్రీనాథ్ ధామాలు కీలక అడుగు వేయబోతున్నాయి. హిమాలయాల ఒడిలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రాల్లో ఇకపై హిందువులకే దర్శన అనుమతి ఇవ్వాలని బద్రీనాథ్, కేదార్‌నాథ్ దేవాలయ కమిటీ నిర్ణయానికి వచ్చింది. ఆలయాల ఆధ్యాత్మిక పవిత్రత, ఆచారాల పరిరక్షణ కోసమే ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు కమిటీ స్పష్టం చేసింది. త్వరలో జరగనున్న బోర్డు సమావేశంలో దీనికి అధికారిక ఆమోదం లభించనుంది. ఇప్పటికే గంగోత్రి ధామ్‌లో ఇదే నిబంధన అమల్లోకి రావడం గమనార్హం. దేవాలయాలు కేవలం సందర్శన స్థలాలు కాదు, భక్తి–విశ్వాసాలకు ప్రతీకలని ఈ నిర్ణయం గుర్తుచేస్తోంది. శివకేశవుల సన్నిధిలో శ్రద్ధ, నియమం, సంప్రదాయమే ప్రధానమన్న భావనకు ఇది బలమైన సంకేతంగా మారింది. ధామాల పవిత్రతను కాపాడే ఈ నిర్ణయం భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని మరింత పెంచుతోంది.

Kedar, Badrinath Temple Board's key decision
Kedar, Badrinath Temple Board’s key decision

 

 

Share this post with your friends