లలితా త్రిపుర సుందరీదేవి పూజ ఎలా చేయాలి?

శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి.. ఒకవైపు లక్ష్మీదేవి, మరోవైపు సరస్వతీదేవి ఇరువైపులా నిలబడి వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్ఠాన శక్తిగా కొలువుదీరి దర్శనమిస్తుంది. శ్రీ లలితా పరాభట్టారిక కష్టాలు తొలగించి, అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిని కన్యలు మంచి భర్త కొరకు, ముత్తైదువులు దీర్ఘ సుమంగళి తనం కోసం పూజిస్తారు. లలితా దేవి అనుగ్రహం పొందాలంటే సుహాసిని పూజ చేసుకోవాలి. హిందూ సంప్రదాయంలో సుహాసిని పూజ అనేది ఒక భాగమని పండితులు చెబుతారు. ఈ పూజ నిర్వహించే ముత్తైదువులను లలితా దేవి స్వరూపంగా భావిస్తారు.

సువాసిని పూజ చేసే వారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. అలాగే పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని అలంకరించుకోవాలి. పూజకు ముత్తైదువులందరినీ ఆహ్వానించి వారి కాళ్లకు పసుపు రాసి పారాణి పెట్టాలి. ఇక పూజా మందిరంలో లలితాదేవిని ప్రతిష్టించిన మీదట ముత్తైదువులందరితో కలిసి సామూహిక లలితా సహస్రనామ పారాయణం చేయాలి. లలితా పంచమి నాడు వీలును బట్టి మూడు సార్లు లేదంటే ఐదు సార్లు లలితా సహస్రనామ పారాయణం చేయాలి. అనంతరం అమ్మవారికి నైవేద్యంగా చక్కర పొంగలి, కదంబ ప్రసాదం, పులిహోర, బూరెలు వంటివి సమర్పించాలి. అనంతరం ముత్తైదువులకు భోజనం పెట్టి తాంబూలమివ్వాలి.

Share this post with your friends