
తొండమాన్ పురం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో అత్యంత వైభవంగా పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. వీటికి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. ఆగస్టు 6 న సాయంత్రం 6 గంటలకు అంకురార్పరణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ పవిత్రోత్సవాలు ఆగస్ట్ 9వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఏడాది పొడవునా జరిగిన దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రాకుండా ఆగమశాస్త్రం ప్రకారం ఈ ఉత్సవా నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాలకు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలు ఆగస్ట్ 7న ప్రారంభమవుతాయి. దీనిలో భాగంగా ఆగస్టు 7న ఉదయం పవిత్ర ప్రతిష్ఠ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఆగస్టు 8న ఉదయం పవిత్ర సమర్పణ, సాయంత్రం చతుష్టానార్చన నిర్వహిస్తారు. ఆగస్టు 9న ఉదయం మహా పూర్ణాహుతి, పవిత్ర వితరణ, స్నపనతిరుమంజనం, చక్రస్నానంతో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. అనంతరం సాయంత్రం ప్రాకార ఉత్సవం, ఆస్థానం వంటి కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహిస్తారు.
