
తమిళనాడు రాష్ట్రం చెన్నైలో కొలువైన శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఫిబ్రవరి 16న అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి. 11 రోజుల పాటు అంటేఈ నెల 26 వరకూ పెద్ద ఎత్తున జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి 7 గంటలకు అమ్మవారు యోగనరసింహుడి అలంకారంలో సింహ వాహనంపై భక్తులను కటాక్షించారు.
ఇందులో భాగంగా ఫిబ్రవరి 20వ తేదీన ఉదయం కల్పవృక్ష వాహనంపై, రాత్రి హనుమంత వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. ఆలయ అధికారులు సైతం భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా సకల ఏర్పాట్లు చేశారు. మరోవైపు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం, సాయంత్రం అమ్మవారికి వివిధ రకాల వాహన సేవలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ పార్థసారధి, సూపరింటెండెంట్ శ్రీమతి పుష్పలత, ఆలయ అర్చకులు ఇతర అదికారులు పాల్గొన్నారు.
