తిరుమలలో దర్శనాలు ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో తెలుసా?

ఆన్లైన్ ద్వారా 300 దర్శనాలు దొరికలేదని చాలామంది బాధపడతారు. శ్రీవారి దర్శనం ఎలా చేసుకోవాలని అంతా ఆలోచిస్తుంటారు. తిరుమలలో 8 రకాలుగా దర్శనం చేసుకోవచ్చు. ఆ ఎనిమిది రకాల దర్శనాలేంటో తెలుసుకుందాం.

1. ఎస్ఎస్‌డీ టోకెన్స్ ( Slotted Sarva Darshanam): ముందు రోజు రాత్రి 9 నుంచి శ్రీనివాసం (తిరుపతి బస్ స్టేషన్ ) విష్ణు నివాసం (తిరుపతి రైల్వేస్టేషన్ ) భూదేవి కాంప్లెక్స్ (అలిపిరి) రోజుకి 25 వేలు చొప్పున జారీ చేస్తారు. మరుసటి రోజు దర్శనం 12 తరువాత ఉంటుంది. 2 నుంచి 4 గంటల్లో దర్శనం అయిపోతుంది. ఇవి ఉచితం. ఇవే టికెట్స్ ఆన్‌లైన్‌లో అయితే రూ.300 చెల్లించాలి.

2.సర్వ దర్శనం: దీనినే ఉచిత దర్శనం అంటారు. రోజుకి ఇన్ని మాత్రమే అని నిబంధన అంటూ ఏమీ లేదు. రోజుకి ఎన్ని సార్లు ఎంత మందైనా దర్శనం చేసుకోవచ్చు. దర్శన సమయం 8 గంటలు పట్టొచ్చు

3.దివ్యనుగ్రహ హోమం టికెట్స్: ఇవి అలిపిరి వద్ద సప్త గో ప్రదక్షిణ మండపం వద్ద తెల్లవారి 2 నుండి 6 వరకు రోజుకి 50 చొప్పున జారీ చేస్తారు. అదే రోజు ఉదయం తిరుపతి అలిపిరి వద్ద హోమామ్‌లో పాల్గొని మధ్యాహ్నం దర్శనం చేసుకోవాలి.

4.శ్రీవాణి టికెట్స్: తిరుపతి ఎయిర్‌పోర్టులో రోజుకు రూ.100 చొప్పున.. తిరుమలలో కొండ మీద జేఈవో ఆఫీస్ వద్ద రోజుకు రూ.900 చొప్పున.. అంటే మొత్తంగా రోజుకు రూ. 1000 చొప్పున ఒక రోజు ముందుగా జారీ చేస్తారు. శ్రీవాణి టికెట్స్‌కి మొదటి గడప దర్శనం ఉంటుంది. అంటే గర్భాలయంలో ఒక గడప దాటి దర్శనం చేసుకోవచ్చు

5.దివ్య దర్శనం (DD darshanam): కాలి నడకన వెళ్లే భక్తులకు రోజుకి 2 వేలు చొప్పున శ్రీవారి మెట్టు వద్ద తెల్లవారి 6 నుంచి జారీ చేస్తారు. దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది

6.రక్త దానం: అశ్వని హస్పిటల్‌లో రక్త దానం చేసేవారికి రోజుకి 10 మందికి దర్శనం కల్పిస్తారు. రక్తదాన కార్యక్రమం తెల్లవారి 5 నుండి ఉంటుంది. దర్శన సమయం 2 నుండి 5 గంటల ఉంటుంది

7.ఆఫ్‌లైన్ లక్కీ డిప్: ఒకరోజు ముందు జేఈవో కార్యాలయం వద్ద ఉదయం 11 నుంచి 5 లోపు లక్కీడిప్‌లో పాల్గొనాలి. సాయంత్రo 6 గంటలకి రిజల్ట్స్ వస్తాయి. డిప్‌లో ఎంపిక అయితే మరుసటి రోజు సేవ, తరువాత దర్శనం ఉంటుంది. సేవ గంట లోపు, దర్శనం 2 గంటల లోపు అయిపోతుంది

8.వీఐపీ బ్రేక్ దర్శనం: స్థానిక ఎమ్మెల్యే/ఎంపీ లెటర్ ద్వారా ఒక లెటర్‌పై 6 వరకూ దర్శనం కల్పిస్తారు. ఒక రోజు ముందు 11 లోపు జేఈవో ఆఫీస్ వద్ద లెటర్ ఇవ్వాల్సిఉంటుంది. సాయంత్రం ఎంపిక అయినట్లు మొబైల్‌కి మెసేజ్.. ఇంకా పేమెంట్ లింక్ వస్తుంది. ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసి టికెట్స్ పొందాలి. మరుచటి రోజు ఉదయం మొదటి గడప దర్శనం ఉంటుంది. టికెట్ ధర ఒక్కొక్కరికి రూ.500 ఉంటుంది.

Share this post with your friends