ప్రపంచ రికార్డ్స్ నమోదు చేసిన బ్రహ్మోత్సవాల్లో చిన్నారుల నృత్యం

సమతా కుంభ్‌-2025 శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా చేసిన నృత్యం ప్రపంచ రికార్డ్ నమోదు చేసింది. ఏడో రోజు మధ్యాహ్నం జరిగిన మహానాట్య బృందం చేసిన నృత్యాలు నాలుగు ప్రపంచ రికార్డ్స్ నమోదు చేసింది. సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో సమతా కుంభ్‌-2025-108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన నాట్యం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఘంటసాల పవన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో 3 వేల మందితో మహా బృందం ఈ నాట్యాన్ని చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పాఠశాల నుంచి వచ్చిన 3 వేల మంది చిన్నారులు వివిధ నృత్య రూపాలతో ఆ దేవదేవుడికి కళాభిషేకం చేశారు. ఈ క్రమంలోనే ఈ నృత్యం నాలు రికార్డులను నమోదు చేసింది. ఇండియన్ వరల్డ్ రికార్డు, వండర్ బుక్ అఫ్ రికార్డ్స్, గోల్డెన్ స్టార్ రికార్డు, జీనియస్ బుక్ అఫ్ రికార్డ్స్ వంటి నాలుగు రికార్డులను నమోదు చేసింది. నాలుగు ప్రపంచ రికార్డులు నెలకొల్పిన విద్యార్థులను శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి అభినందించారు. ఈ నృత్యంలో పాల్గొన్న చిన్నారులందరికీ చిన్న జీయర్ స్వామి మంగళ శాసనాలు అందించి.. చిన్నారుల తల్లిదండ్రులను అభినందించారు.

Share this post with your friends