
ప్రస్తుతం శారదీయ నవరాత్రులు జరుగుతున్నాయి. ఆశ్వయుజ మాసంలో శరత్ వెన్నెలలో జరుపుకునే నవరాత్రులనే శారదీయ నవరాత్రులని అంటారు. పది రోజుల పాటు ఈ నవరాత్రులను జరుపుకుంటాం. ఈ పది రోజులలో వచ్చే అష్టమి, నవమి తిథులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30న అష్టమి పూజ జరుగనుంది. అలాగే నవమి పూజ నవంబర్ 1న జరుగనుంది. ఈ రెండు రోజుల పాటు మన ఇంట్లో దీపాలు వెలిగిస్తే దుర్గాదేవి ఆశీస్సులు లభిస్తాయట. అలాగే ఇంట్లో ఆర్థిక సమస్యలనేవే ఉండవని చెబుతారు.
దుర్గాదేవిని వివిధ రూపాల్లో ఈ నవరాత్రుల్లో పూజించుకుంటామన్న విషయం తెలిసిందే. అయితే నవరాత్రుల్లో అష్టమి, నవమిని మహాగౌరి దేవి, సిద్ధిదాత్రి దేవికి పూజలు నిర్వహించుకుంటాం. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలంటే ఈ అష్టమి, నవమి రోజుల్లో ఏం చేయాలో తెలుసుకుందాం. అష్టమి, నవమి రోజుల్లో సాయంత్రం వేళ ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాల్సి ఉంటుంది. అయితే దీపం జ్వాల ఉత్తరవైపు ఉండేలా చూసుకోవాలట. ఇలా చేయడమనేది వాస్తు శాస్త్రపరంగా కూడా చాలా మంచిదట. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందట. దుర్గాదేవి, లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయట.
