మరోసారి తెరపైకి శ్రీవారి ఆలయంపై యాంటీ డ్రోన్ అంశం

తిరుమల శ్రీవారి ఆలయంపై తరచుగా డ్రోన్ల సంచారం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఆగమ శాస్త్రానికి విరుద్ధమైన ఈ డ్రోన్ల సంచారంపై టీటీటీ కలవరపడుతోంది. ఈ క్రమంలోనే యాంటీ డ్రోన్‌ సిస్టమ్ ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్రానికి మరోసారి తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తూ సిఫార్సు లేఖ రాసింది. ఈ మేరకు కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు నుంచి ఒకసారి గ్రీన్‌ సిగ్నల్ వచ్చిందంటే చాటు.. సాధ్యమైనంత త్వరగా యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ భావిస్తోంది.

ఒకసారి యాంటీ డ్రోన్ సిస్టమ్ అందుబాటులోకి వచ్చిందంటే.. కొండ పరిసర ప్రాంతాలపై వీడియో ట్రాకింగ్‌ ఏర్పాటు చేస్తారు. ఇందులో ఉండే లాంగ్ రేంజ్ సర్వైలైన్స్ సిస్టమ్‌.. సుదూర ప్రాంతాల్లో డ్రోన్‌లను ఎగరేసినా ఇట్టే పసిగట్టి సమాచారాన్ని అందిస్తుంది. ఆర్‌ఎఫ్ ట్రాకింగ్ సిస్టమ్ అనుమానిత వస్తువులను గుర్తించగానే మొబైల్ రెస్పాన్స్ టీం అలర్ట్ అవుతుంది. ఆ తర్వాత జామింగ్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేసి డ్రోన్‌ను నియంత్రించే సంకేతాలను నియంత్రించడంతో పాటు రెప్పపాటులో డ్రోన్‌ దగ్గరకు వెళ్లి దాన్ని క్రాష్ చేస్తుంది. ఈ టెక్నాలజీతో కొండపై భద్రతను పటిష్టం చేసే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది.

Share this post with your friends