తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయానికి బుధవారం సాయంత్రం కియోస్క్ యంత్రాన్ని ఎస్‌బీఐ విరాళంగా అందించింది. క్యూఆర్ కోడ్ యంత్రంతో యూపీఐ మోడ్‌లో రూ. లక్ష వరకూ భక్తులు విరాళంగా అందజేయవచ్చు. ఇప్పటికే ఎస్‌బీఐ 5 కియోస్క్ యంత్రాలను అందించగా, వాటిని తిరుమల, తిరుపతి, దేవుని కడపలలో తిరుమల తిరుపతి దేవస్థానం వినియోగిస్తోంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణ రెడ్డి, ఎస్‌బీఐ డిజిఎం శ్రీమతి లేఖా మీనన్, ఆర్ ఎం శ్రీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి ఆలయంలో రామానుజ జీయర్ పూజలు..
బుధవారం ఉదయం తిరుమలలోని శ్రీ వారి ఆలయంలో శ్రీ యదుగిరి యతిరాజ మఠం, మెల్కోటేలోని శ్రీ శ్రీ శ్రీ యదుగిరి యతిరాజ నారాయణ రామానుజ జీయర్ పూజలు నిర్వహించారు. శ్రీ వారి ఆలయం ముందు భాగంలో ఆయనను అదనపు ఈఓ శ్రీ వెంకయ్య చౌదరి మరియు ఆలయ పూజారులు ఆలయ గౌరవ మర్యాదలతో స్వాగతించి, శాంటోరియంకు తీసుకెళ్లారు. టీటీడీ బోర్డు సభ్యుడు శ్రీ నరేష్ కుమార్, పేష్కార్ శ్రీ రామకృష్ణ మరియు ఇతరులు హాజరయ్యారు.