వినాయక చవితి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ముంబై. ఇక్కడ వినాయక చవితి తరువాతే మరెక్కడైనా.. ముంబైలోని లాల్‌బాగ్చా రాజా వినాయక ఉత్సవం చాలా స్పెషల్. ఇక్కడికి గణపయ్య ముఖ దర్శనానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. ఈ సారి లాల్‌బాగ్ రాజు తొలిచిత్రం బయటకు వచ్చి రాగానే అందరి దృష్టి స్వామివారి కిరీటంపై పడింది. దీనిపై ఎవరిచ్చారు? ఏంటనే విషయాలపై చర్చ ప్రారంభమైంది. దీనిని అనంత్ అంబానీ బహూకరించారించారట. తన వివాహానంతరం వచ్చిన తొలి వినాయక చవితి ఇది.
ఈ క్రమంలోనే లాల్‌బాగ్ రాజా గణేషుడి కోసం 20 కేజీల బంగారంతో కిరీటాన్ని తయారు చేయించి బహుమతిగా ఇచ్చారు. దీని విలువ రూ.20 కోట్లు అని సమాచారం. దీనిని తయారు చేసేందుకు నిపుణులు చాలా కష్టపడాల్సి వచ్చిందట. దాదాపు 2 నెలల పాటు శ్రమించి ఈ కిరీటాన్ని తయారు చేశారట. ఇక ఈ వినాయకుడు సంప్రదాయ మెరూన్ కలర్ దుస్తుల్లో చేతిలో చక్రం, నుదుటిపై త్రిశూల తిలకంతో చూపరులను కళ్లు తిప్పుకోనివ్వడం లేదు. విలువైన ఆభరణాలకు తోడు అనంత్ అంబానీ చేయించిన బంగారు కిరీటంతో వినాయకుడు శోభాయమానంగా వెలిగిపోతున్నాడు.