40 ఏళ్ల తర్వాత మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెలకు మోక్షం

మేడారం జాతర అంటే తెలంగాణ వాసులకు అతి పెద్ద పండుగ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జాతర ఇది. దీనిని గతంలోనే అప్పటి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా మార్చింది. ప్రస్తుతం మేడారం రూపు రేఖలను మార్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూనుకుంది. సమ్మక్క, సారలమ్మ గద్దెల పునర్‌నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ని రిలీజ్‌ చేశారు. ఇటీవలే రాష్ట్ర మంత్రులతో కలిసి రేవంత్ మేడారం వెళ్లి సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే సమ్మక్క, సారలమ్మల గద్దెల ప్రాంగణాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు.

ఈ క్రమంలోనే పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 40 ఏళ్ల తర్వాత మేడారం ప్రాంగణ ఆధునీకరణకు అడుగులు పడటంతో తెలంగాణవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లకు ఒక్కసారి ఇక్కడ మహాజాతర జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత ఏడాదంతా సమ్మక్క, సారలమ్మల గద్దెలను దర్శించుకునేందుకు వీలుగా మేడారం అభివృద్ధి పనులు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి తాజాగా గిరిజన పూజారులు గిరిజన సాంప్రదాయ ప్రకారం అభివృద్ధి పనులపై గద్దెల ప్రాంగణంలో శంకుస్థాపన పనులను ప్రారంభించారు.

Share this post with your friends