శ్రీవారికి 24 బంగారు పతకాలు, 2 వెండి తట్టలు విరాళం..

కలియుగ దైవం, తిరుమల శ్రీ మలయప్పస్వామివారికి ఇద్దరు భక్తులు కోట్ల విలువ చేసే బంగారు పతకాలను విరాళంగా అందించారు. మొత్తంగా 24 బంగారు పతకాలు స్వామివారికి విరాళంగా అందాయి. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి చైన్నైకు చెందిన ఓ అజ్ఞాత భక్తుడు సాధారణ రాళ్లు పొదిగిన రూ. ఒక కోటి విలువ చేసే తొమ్మిది బంగారు పతకాలను శ్రీవారి ఉత్సవ మూర్తులకు సోమవారం విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులకు పతకాలను అందజేశారు.

శ్రీవారికి 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలు..

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఓ మఠాధిపతి 15 బంగారు పతకాలను విరాళంగా అందజేశారు. శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం మఠాధిపతి శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వామీజీ రూ.1.80 కోట్లు విలువైన 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలను శ్రీ మలయప్ప స్వామివారికి సోమవారం నాడు తిరుమలలో బహుకరించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో పేష్కార్ శ్రీ రామకృష్ణకు స్వామీజీ కానుకలు అందజేశారు.

Share this post with your friends