తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి జత కర్ణపత్రములు..

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి హైదరాబాద్‌కు చెందిన కె. దీపక్ గురువారం ఉదయం 178 గ్రాముల బరువు కలిగిన బంగారు, రాళ్లతో పొదిగిన జత కర్ణపత్రములను బహుకరించారు. దాదాపు రూ. 23 లక్షల విలువైన ఈ జత కర్ణపత్రములను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు దాత అందజేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానంతరం దాతకు టిటిడి అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

తిరుచానూరు వేంకటేశ్వరుని ప్రియ సతీమణి శ్రీ పద్మావతి దేవి నివాసం. ఈ పుణ్యక్షేత్రం “అలర్మేల్మంగాపురం”. దీని అర్థం ఏమిటంటే.. (అలర్ అంటే తామర పువ్వు, మెల్ అంటే పైన, మంగా అంటే దేవత, పురం అంటే ఊరు) లేదా అలిమేలుమంగాపురంగా ప్రఖ్యాతిగాంచింది. ఆలయ పురాణం ప్రకారం.. ఆలయ అవరణలో ఉన్న టాంక్ (పద్మసరోవరం) మధ్యలో పద్మావతి దేవి బంగారు కమలంపై మహాలక్ష్మి దేవిగా ఉద్భవించింది కాబట్టి, ఈ ప్రదేశం “అలరమేల్మంగాపురం” పేరుతో ప్రసిద్ధి చెందింది. తీర్థయాత్రల సమయంలో తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించిన తర్వాతనే ఫలప్రదం కలుగుతుందని చెబుతారు.

Share this post with your friends