సూర్యగ్రహణం ఎప్పుడు? భారతదేశంలో కనిపిస్తుందా?

హిందువులు సూర్య, చంద్ర గ్రహణలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. భూమి, సూర్యుని మధ్య చంద్రుడు వెళ్ళినప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఇక ఈ ఏడాది ప్రస్తుతం రెండో సూర్య గ్రహణం ఏర్పడనుంది. అయితే ఈ సారి సూర్యగ్రహణంతో పాటు అరుదైన ఘటన కూడా జరగనుంది. మరి సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడునుంది? ఈ సారి అదెప్పుడో తెలుసుకుందాం. సూర్యగ్రహణం అక్టోబర్ 2 రాత్రి 9.13 గంటలకు ప్రారంభమై మర్నాడు అంటే అక్టోబర్ 3 మధ్యాహ్నం 3.17 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ సూర్యగ్రహణం మనకు అంటే భారతీయులకు కనిపించే అవకాశం లేదు.

మనకు సూర్యగ్రహణం కనిపించకపోవడానికి ఓ కారణం ఉంది. ఈ సూర్యగ్రహణం సంభవించినప్పుడు, భారతదేశంలో రాత్రి సమయం ఉంటుంది. అందువల్ల ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. అయితే సూర్య గ్రహణ సమయంలో అరుదైన ఘటన జరగనుందని ముందుగానే చెప్పుకున్నాం. ఖగోళంలో రింగ్ ఆఫ్ ఫైర్‌ ఏర్పడనుంది. దీనిని కూడా భారతీయులు వీక్షించలేరు. దీనిని కొన్ని దేశాల వారు మాత్రమే చూడగలరు. అర్జెంటీనా, పెరూ, దక్షిణ అమెరికా, ఇతర ప్రదేశాలలో సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఇక భారత్‌లో సూర్యగ్రహణం రాత్రి వేళ జరుగుతుంది కాబట్టి ఇక్కడ సూతకాలం ఉండదు.

Share this post with your friends