విష్ణుమూర్తి నిద్రలేచే ఉత్థాన ఏకాదశి ఎప్పుడు?

కార్తీక మాసంలో ప్రతి రోజుకూ ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో శుక్ల పక్షం ఏకాదశి తిథిని ఉత్తమమైనదిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి తన నాలుగు నెలల యోగ నిద్ర నుంచి మేల్కొంటాడట. ఈ ఉత్థాన ఏకాదశి తర్వాత నుంచి పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలన్నీ ప్రారంభమవుతాయి. విష్ణుమూర్తి మేల్కొనే ఈ రోజున నియమ నిష్టల ప్రకారం స్వామివారిని పూజించడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని చెబుతారు.

ఉత్థాన ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజించడంతో పాటు కొన్ని నియమాలు పాటిస్తే మనిషి జీవితంలో డబ్బుకు లోటు ఉండదని నమ్ముతారు. మరి ఈ ఉత్థాన ఏకాదశి ఎప్పుడనేది తెలుసుకుందాం. వేద క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం కార్తీక మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి 11 నవంబర్ 2024 సాయంత్రం 6.46 గంటలకు ప్రారంభమై ఈ తిధి నవంబర్ 12, 2024 సాయంత్రం 4:04 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం మనం ఏ పండుగనైనా జరుపుకుంటాం కాబట్టి ఉత్థాన ఏకాదశి ఉపవాసం నవంబర్ 12వ తేదీ మంగళవారం నాడు ఆచరిస్తారు.

Share this post with your friends