
హిందూ మతంలో ప్రతి పండుగకు ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుంది. శరత్ పున్నమి పండుగకు హిందూ మతంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. అసలు ఈ శరత్ పున్నమి నాడు చంద్రుడు భూమిపై అమృతాన్ని కురిపిస్తాడని చెబుతారు. అందుకే ఈ రోజున ఆసక్తికరంగా బియ్యం, పాలతో పాయసం చేసి దానిని రాత్రి సమయంలో చంద్రుడికి పెడతారు. ఆ రోజంతా దానిని అలా ఉంచేసి.. మరునాడు దానిని ప్రసాదంగా తీసుకుంటారు. అలా ప్రసాదంగా తీసుకుంటే మంచిదని చెబుతారు. ఇలా చంద్రుడికి పాయసం సమర్పిస్తే ఆరోగ్యంతో పాటు శ్రేయస్సు కూడా ఉంటుందని చెబుతారు.
ఈ ఏడాది శరత్ పూర్ణిమ ఎప్పుడు వస్తుందో ముందుగా తెలుసుకుందాం. ఈ సంవత్సరం శరత్ పూర్ణిమను ఎప్పుడు జరుపుకోవాలనే దానిపై గందరగోళం నెలకొంది. అక్టోబర్ 6 లేదా 7న జరుపుకోవాలనే విషయంపై ప్రజల్లో గందరగోళం నెలకొంది. హిందూ క్యాలెండర్ ప్రకారం పౌర్ణమి తిథి అక్టోబర్ 6న మధ్యాహ్నం 12:23 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు అంటే అక్టోబర్ 7న ఉదయం 9:16 గంటలకు ముగుస్తుంది. పౌర్ణమి తిథి అక్టోబర్ 6న ప్రారంభమై ఆ రోజు రాత్రి చంద్ర దర్శనం అవుతుంది. కాబట్టి శరత్ పూర్ణిమ ఉపవాసం, పూజలు 2025 అక్టోబర్ 6 సోమవారం నాడు నిర్వహిస్తారు.
