
వినాయకచవితి సమయంలోనూ.. అలాగే దేవీ శరన్నవరాత్రుల సమయంలో అఖండ జ్యోతికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి తొమ్మిది రూపాలను హిందూ ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా పూజించుకుంటారు. అలాగే దుర్గమ్మ మండపాల్లోనూ.. కొందరు ఇంట్లోనూ తొమ్మిది రోజుల పాటు అఖండ జ్యోతిని వెలిగిస్తారు. నవరాత్రి సమయంలో వెలిగించే అఖండ దీపం కొండెక్క కూడదని అంటారు. దానికి కోసం తగిన చర్యలు తీసుకుంటారు. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ఒకవేళ పొరపాటు అఖండ దీపం కొండెక్కితే ఏం చేయాలో తెలుసుకుందాం.
అఖండ దీపం కొండెక్కితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పూజకు ముందే అంతరాయం ఏర్పడకుండా అఖండ దీపం పక్కన చిన్న దీపం వెలిగించాలి. అఖండ దీపం కొండెక్కితే దాని నుంచి సగం కాలిన వత్తిని తీసేసి కొత్త వత్తి వేసి తిరిగి వెలిగించాలి. పక్కన వెలిగించిన చిన్న దీపం నుంచే అఖండ దీపాన్ని తిరిగి వెలిగించాలి. అఖండ దీపం వెలిగించిన మీదట చిన్న దీపం లేకున్నా కూడా పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. అఖండ దీపాన్ని వెలిగించేటప్పుడు “ఓం జయంతి మంగళ కాళీ భద్రకాళి కృపాళినీ, దుర్గా క్షమా శివ ధాత్రీ స్వాహా స్వధా నమోస్తుతే.. దీపజ్యోతి: పరబ్రహ్మ: దీప్జ్యోతి జనార్దనః, దీపోహరతిమే పాపం సంధ్యాదీపం నమోస్తుతే..” అనే మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిదట.
