ఇవాళ ప్రదోష వ్రతం ఆచరించిన వారు ఏ ఏ వస్తువులను దానం చేయాలంటే..

ఇవాళ హిందూ మతంలో అత్యంత ముఖ్యమైన రోజు. ఇవాళ ప్రదోష వ్రతం ఆచరించి ఉపవాసం ఉంటారు. ఈ ప్రదోష వ్రత ఉపవాసం ప్రతి నెల కృష్ణ పక్షం, శుక్ల పక్షం త్రయోదశి తిథి రోజున ఆచరిస్తారు. శివుడి కోసం అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున కైలాస పర్వతంలో ఉన్న శివుడు ధ్యానంలో కూర్చుంటాడని..ఆయనను పూజించడం ద్వారా ప్రజలు విశేష ఫలితాలను పొందుతారని నమ్మకం. అయితే దానం చేసేటప్పుడు శివుడిని స్మరించుకోవాలి. ఇక ఇవాళ వ్రతం ఆచరించిన వారు ఏ ఏ వస్తువులను దానం చేస్తే మంచిదో తెలుసా?

వేటిని దానం చేయాలంటే..

గోదానం: ఆవును లక్ష్మీదేవి, విష్ణువు రూపంగా భావిస్తారు కాబట్టి ఇవాళ గోదానం చేస్తే మన సంపద బాగా వృద్ధి చెందుతుందట.

వస్త్ర దానం: వస్త్ర దానం కూడా చాలా మంచిదట. ఇవాళ వస్త్రదానం చేస్తే శివుడు సంతోషించి మనకు జీవితంలో సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడు.

నీటి దానం: ఇవాళ తాగు నీటిని పక్షులకు అందించడం వలన పుణ్యఫలితాలు కలుగుతాయి, పితృ దోషాలు కూడా తొలగిపోతాయి.

నల్ల నువ్వులు: ఇవి శివునికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి నల్ల నువ్వులను దానం చేస్తే శని దేవుడి అనుగ్రహం లభించి గ్రహ సంబంధమైన అడ్డంకులు తొలగిపోతాయి.

పండ్లు దానం: పండ్లను శివునికి నైవేద్యంగా సమర్పించి అనంతరం వాటిని దానం చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు జాతకంలో గ్రహాల స్థితి బలపడుతుంది.

Share this post with your friends