శ్రీరంగనాథుడి ఆలయ విశేషాలేంటంటే..

కర్ణాటక జిల్లాలోని మాండ్య పట్టణంలో గల రంగనాథ స్వామి క్షేత్ర విశేషాల గురించి తెలుసుకుందాం. పూర్వం బ్రహ్మ స్వయంగా ఇక్కడ శ్రీ రంగనాథుడి విగ్రహాన్ని తయారు చేసి పూజించమని శ్రీరాముడి పూర్వీకులకు ఇచ్చాడట. శ్రీరాముని ద్వారా ఈ విగ్రహం శ్రీరంగపట్నానికి చేరిందని కూడా చెబుతారు. శ్రీ రంగపట్నం రంగనాథుని దర్శనానికి వెళ్లే భక్తులు ముందుగా ఐదంతస్థుల రాజగోపురాన్ని దాటి లోపలకు ప్రవేశిస్తారు. అక్కడ గర్భగుడిలో ఆదిశేషునిపై శయనిస్తూ దేవేరి రంగనాయకి సమేత రంగనాథుడు దర్శనమిస్తాడు.

అలాగే ఈ క్షేత్రంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు, ఆళ్వార్లు, గరుడ, హనుమంతుడు, నరసింహుడు తదితర దేవతతామూర్తులను కూడా దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో ఉదయం సుప్రభాత సేవ నిర్వహిస్తారు. ఆ తరువాతి నుంచి రాత్రి పవళింపు సేవ వరకూ అన్ని సేవలూ శ్రీవైష్ణవ ఆగమ పద్దతిలో నిర్వహించడం జరుగుతుంది. ఇక ధనుర్మాసం వచ్చిందంటే ఆ నెలంతా తిరుప్పావై ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారా దర్శనం… భోగి పండుగ రోజు శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ క్షేత్రానికి వెళ్లాలంటే బెంగుళూరు నుంచి రవాణా సదుపాయాలుంటాయి.

Share this post with your friends