Sri Someswara Janardana Swamy Temple History : శివుడు రంగులు మార్చే ఆలయం ఎక్కడుందో తెలుసా?

మన దేశంలో ఎన్నో ఆలయాలు ఎన్నో రహస్యాలకు నిలయంగా న్నాయి. అలాంటి ఆలయం ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర ఉన్న గుణిపూడిలో సోమారామం అనే ఆలయం ఉంది. ఇక్కడ పరమేశ్వరుడు.. సోమేశ్వరుడిగా కొలువుదీరాడు. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవల్సినది ఆలయ నిర్మాణం గురించి.. ఇలాంటి నిర్మాణం దేశంలో మరెక్కడా లేదు. అంత అద్భుతంగా ఉంటుంది. సోమేశ్వర క్షేత్రం భీమవరం పట్టణానికి దగ్గరలోని గుణిపూడి గ్రామంలో ఉంది. ఇక్కడి శివుడికి చంద్రుడి పేరు మీదుగా సోమేశ్వరుడు అని పిలుస్తారు.

Sri Someswara Janardana Swamy Temple History
Sri Someswara Janardana Swamy Temple History

అలా ఈ క్షేత్రం సోమారామంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ఆలయ నిర్మాణం ఒక్కటే ప్రత్యేకత కాదు.. అంతకు మించిన ప్రత్యేకత శివలింగానిది. సాధారణ రోజుల్లో సోమేశ్వరాలయంలోని శివలింగం మనకు తెలుపు రంగులో దర్శనమిస్తూ ఉంటుంది. కానీ అమావాస్య వచ్చేసరికి రంగు మారిపోతుంది. తెలుపు రంగు పోయి.. గోధుమ రంగులో మనకు కనిపిస్తుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి శివలింగానికి తన సాధారణ రంగు అయిన శ్వేత వర్ణంలోకి వచ్చేస్తుంది. దాదాపు శతాబ్ద కాలంగా ఇక్కడ ఇలా జరుగుతోందని పూజారులు చెబుతున్నారు. ఈ మార్పులను చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు.

Share this post with your friends