నవ నారసింహ క్షేత్రాల్లో ఆరవది పెంచలకోన నరసింహ స్వామి క్షేత్రం. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా రాపూరు మండల కేంద్రంలోని పెంచలకోనలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయ విశేషం ఏంటంటే.. ఇక్కడ నరసింహ స్వామి చెంచులక్ష్మి సమేతుడై వెలసి ఉన్నాడు. అందుకే ఇక్కడ స్వామివారిని పెనుశిల లక్ష్మీనృసింహస్వామిగా పిలుస్తారు. ఈ ఆలయ కథేంటంటే.. స్వామివారిని ప్రసన్నం చేసుకునేందుకు లక్ష్మీదేవి.. చెంచులక్ష్మి రూపంలో వచ్చిందట. స్వామివారిని చూడగానే ఆయనను పెనవేసుకుని తనలో ఐక్యం చేసుకుందట. ఈ సంఘటన జరిగిన ప్రదేశం కాబట్టి పెనుశిల అని పిలిచేవారు. కాలక్రమంలో అది పెంచలకోనగా మారింది.

నవ నారసింహ క్షేత్రాల్లో ఏడవది యాదగిరి శ్రీ లక్ష్మీనృసింహ స్వామి క్షేత్రం. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఆలయ పునర్నిర్మాణం తరువాత ఈ క్షేత్రం పెద్ద మొత్తంలో భక్తులను ఆకర్షిస్తోంది. ఇక్కడ స్వామివారు ఐదు రూపాల్లో వెలిసి ఉన్నారు. లక్ష్మి నృసింహుడు, జ్వాలా, యోగానంద, గండభేరుండ, ఉగ్ర అనే పంచ రూపాల్లో లక్ష్మీనరసింహ స్వామి వెలిసి ఉండటం విశేషం. యాదాద్రి నరసింహస్వామిని దర్శించుకుంటే ఏం జరుగుతుందంటే.. భక్తులకు ఏమైనా రోగాలున్నా అవన్నీ కూడా నయమవుతాయని విశ్వాసం.
