ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ ప్రాంతంలో వెలసిన పవిత్ర శైవ క్షేత్రాలు పంచ కేదారాలుగా విరాజిల్లుతున్నాయి. పంచ కేదారాల దర్శనంతో మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇప్పటికే పాండవులు ప్రతిష్టించిన పంచ కేదారాల్లో నాలుగు కేదారాల గురించి తెలుసుకుందాం. ఈ క్రమంలోనే పంచ కేదారాల్లో చివరిదైన కల్పేశ్వర్ గురించి తెలుసుకుందాం. మరి కల్పేశ్వర్ ఎక్కడుంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? తెలుసుకుందాం. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ ప్రాంతమైన చమోలిలోని హెలాంగ్ గ్రామం నుంచి దాదాపు 30 కి.మీ కల్పేశ్వరుడు కొలువుదీరి ఉన్నాడు.

ఈ ఆలయం చాలా ఆసక్తికరంగా ఒక గుహ లాగా ఉంటుంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి దాదాపు 2200 మీటర్ల ఎత్తులో ఉంటుంది కాబట్టి దీనికి వెళ్లాలంటే ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లాల్సిందే. కల్పేశ్వర్ చేరుకోవాలంటే ముందుగా ఉగ్రమ్ లోయ మీదుగా 2 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆలయానికి వెళ్లాలంటే.. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ బేస్ పాయింట్‌కు చేరుకుని వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి దాదాపు 243 కి.మీ. ప్రయాణిస్తే కానీ హోలాంగ్ గ్రామానికి చేరుకోలేం. ఆ అక్కడికి బస్సు లేదంటే కారులో వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ప్రైవేటు వాహనాలలో కొంత దూరం ప్రయాణిస్తే ఉర్గం లోయకు చేరుకోవాల్సి ఉంటుంది. ఉర్గం నుంచి 2 కి.మీ దూరం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.
