నవ నారసింహ క్షేత్రాల్లో ఎనిమిదో క్షేత్రం సింహాచలం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణానికి సమీపంలోని తూర్పు కనుమల్లో సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తులో నరసింహస్వామి వెలిశాడు. ఇక్కడి స్వామివారిని సింహాద్రి అప్పన్నగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. ఇక్కడ నరసింహుడు.. వరాహ నరసింహ మూర్తుల సమ్మేళనంగా స్వామివారు దర్శనమిస్తాడు. ఇక్కడి స్వామిని తొలుత పూజించింది ప్రహ్లాదుడు కావడం విశేషం. ఈ క్షేత్రంలో ప్రతి అక్షయ తృతీయ రోజు స్వామివారికి చందనోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. అలాగే గురుపూర్ణిమ రోజు గిరిప్రదక్షిణ అత్యంత వైభవంగా జరుగుతుంది.

నవ నారసింహ క్షేత్రాల్లో ఆఖరిది, తొమ్మిదవ క్షేత్రం వేదాద్రి. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణానది ఒడ్డున చిల్లకల్లుకి 10 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. ఆలయ స్థల పురాణం ప్రకారం.. ఇక్కడ స్వామివారు.. హిరణ్యకశ్యపుని సంహారం తరువాత జ్వాల, సాలగ్రామ, యోగానంద, లక్ష్మి నరసింహ, వీర నరసింహ అనే అయిదు అంశాలతో ఆవిర్భవించాడు. ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని వేద, పురాణ, ఇతిహాసాలు చెబుతున్నాయి. ఇక్కడ స్వామివారు స్వయంభువుగా వెలిసి ఉన్నారు. ఈ నవ నరసింహ క్షేత్రాలను దర్శించుకుంటే చాలా మంచిదని పేర్కొంటారు.
