Nava Janardhana Swamy Temples : నవ జనార్థన క్షేత్రాలు ఎక్కడున్నాయో తెలుసా?

గోదావరి నదికి తూర్పు తీరాన చాలా ఆలయాలున్నాయి. వాటిలో జనార్ధన ఆలయాలు ఉన్నాయి. అంతేకాకుండా వాటిలో తొమ్మిది ఆలయాలు నవ జనార్దన క్షేత్రాలుగా లోక ప్రసిద్ధి గాంచాయి. ఇవి శ్రీ మహా విష్ణువుకు అంకితమైన క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. సాధారణంగానే అన్ని గ్రహ దోషముల నుంచి విముక్తి పొందుటకు ఎలాగైతే భక్తులు.. నవ గ్రహ దోషాలను తొలగించుకునేందుకు సందర్శించుకుంటారో.. ఈ ఆలయాన్ని సైతం అందుకే దర్శించుకుంటారు. ఇంతకూ ఈ తొమ్మిది జనార్ధన క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి? వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Nava Janardhana Swamy Temples
Nava Janardhana Swamy Temples

సాధారణంగా శివాలయాల్లో నవగ్రహ మండపం తప్పనిసరిగా ఉంటుంది. ఆ మండపంలో నవగ్రహాలు తప్పనిసరిగా కొలువై ఉంటాయి. కానీ వైష్ణవాలయాల్లో నవగ్రహ మండపం మాత్ర సర్వసాధారణంగా కనిపించదు. ఇది చాలా అరుదైన విషయం. కానీ మనం చెప్పుకుంటున్న జనార్థన ఆలయాల్లో నవగ్రహ దోషాల విముక్తి కోసం శ్రీ వైష్ణవులు ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తూ ఉంటారు. విష్ణువు ఆలయంలో నవగ్రహ అర్చనలు నిర్వహించడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ నవ జనార్ధన క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుందాం.

శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి – ధవళేశ్వరం
శ్రీ జనార్ధన స్వామి -మడికి
శ్రీ జనార్ధన స్వామి – జొన్నాడ
శ్రీ జనార్ధన స్వామి – ఆలమూరు
శ్రీ జనార్ధన స్వామి – మండపేట
శ్రీ జనార్ధన స్వామి – కపిలేశ్వరపురం
శ్రీ జనార్ధన స్వామి – మాచర
శ్రీ జనార్ధన స్వామి – కోరుమిల్లి
శ్రీ సిద్ధి జనార్ధన స్వామి – కోటిపల్లి

Share this post with your friends