హిరణ్యకశ్యప సంహారం అనంతరం నరసింహ స్వామి తొమ్మిది ప్రాంతాలను సందర్శించాడు. వాటిలో ఒకటి అహోబిలం కాగా.. రెండవది.. మాల్యాద్రి. ఇది ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి పామూరుకు వెళ్లే మార్గంలో వలేటివారి పాలెంలో ఉంది. ఇక్కడ నరసింహా స్వామి స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. ఈ క్షేత్రం విశేషం ఏంటంటే.. స్వామివారు వెలిసిన కొండ ఒక మాల ఆకారంలో ఉంటుంది. కాబట్ట ఈ కొండను మాలకొండ అని అప్పట్లో పిలిచేవారు. కాలక్రమంలో అది కాస్తా మాల్యాద్రిగా మారిపోయింది. అయితే ఇక్కడ వారమంతా స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతి ఉండదు. కేవలం శనివారం మాత్రమే దర్శించుకుంటారు. మిగిలిన ఆరు రోజులు స్వామివారిని దేవతలు, ఋషులు దర్శించుకుంటారని చెబుతారు.

నవ నారసింహ క్షేత్రాల్లో మూడోది అంతర్వేది. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలానికి చెందిన గ్రామం. గోదావరి నది శాఖ అయిన వశిష్టానది ఇక్కడే బంగాళాఖాతంలో కలుస్తుంది.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంకు సమీపంలో కల ఇక్కడ త్రికోణాకారంలో ఒక దీవి ఉంటుంది. దీనిపై ప్రసిద్ధిగాంచిన లక్ష్మీనరసింహాస్వామి పురాతన ఆలయం ఒకటి ఉంది. ఇది నరసింహ స్వామి క్షేత్రాల్లో మూడవది. ఆలయ స్థల పురాణం ప్రకారం ఇక్కడ నరసింహస్వామి కోరిక మేరకు నరసింహస్వామి వెలిశాడట. అందుకే నవ నారసింహ క్షేత్రాల్లో ఈ క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనదని పురాణాలు చెబుతున్నాయి.
