Shiva Statue in Mauritius : మారిషస్‌లోని హరిహర దేవస్థానం విశేషాలేంటంటే..

మారిషస్‌లోని హరి హర దేవస్థానం గురించి చెప్పుకుంటున్నాం కదా. ఆలయ నిర్మాణం దక్షిణ భారతదేశంలోని ద్రావిడ శైలులను పోలి ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే మనకు ముఖ భాగంలోనే వివిధ దేవతలు మనకు దర్శనమిస్తారు. ఆలయమంతా రంగురంగుల శిల్పాలతో అలంకరించబడి ఉంటుంది. ఆలయ గోపురం వచ్చేసి ఆకాశంలోకి దూసుకెళుతున్నట్టుగా ఉంటుంది. ఈ ఆలయం అనేక ఉపాలయాలతో ఉంటుంది. ప్రతి ఒక్క ఆలయం నిర్దిష్ట దేవతలకు అంకితమైంది. ప్రధాన గోపురంలో హరిహరులు కొలువుదీరి ఉన్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వేంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. స్వామివారి విగ్రహం 108 అడుగుల ఎత్తు ఉంటుంది.

Massive Shiva Statue in Mauritius
Massive Shiva Statue in Mauritius

ఆలయ లోపలి గోడలు రామాయణం, మహాభారతం వంటి గొప్ప హిందూ ఇతిహాసాల దృశ్యాలతో ఉంటాయి. ఈ చిత్రాలన్నింటినీ అద్భుతమైన కళాకారులు తీర్చిదిద్దినట్టుగా వాటిని చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇక్కడ కొలువైన శివుడిని కుమార భీమేశ్వరుడు అని పిలవగా, అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా పిలుస్తారు. క్షేత్ర పాలకుడు మాండవ్య నారాయణుడు కాగా.. ఈశ్వరుడు ఇక్కడ ‘వామదేవ’ స్వరూపుడుగా, యోగ లింగంగా వెలిశాడు. చైత్ర, వైశాఖ మాసాల్లో శివలింగంపై సూర్య కిరణాలు నేరుగా పడతాయి. మరో విశేషం ఏంటంటే.. ఆలయ ఆవరణలోని రూరు స్తంభాల మండపంలో ఏ రెండు స్తంభాలు కూడా ఒకదానితో మరొకటి పోలి ఉండవు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఊయల మండపంలోని రాతి ఊయలను ఊపితే రివర్స్‌లో అది ఆగిపోతుంది. ఇక్కడి భీమగుండం అనే కొలను ఉంటుంది. దీనిలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోయి.. కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి.

Share this post with your friends