History of Jampanna Vagu : జంపన్న వాగులో స్నానం చేయకుండా మేడారం గద్దెలను దర్శించుకూడదు…ఎందుకంటే

మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెలను దర్శించుకునే ముందు జంపన్నవాగులో స్నానం చేయడం ఓ పవిత్ర సంప్రదాయం. ఈ వాగు నీరు ఎర్రగా కనిపించడం వెనుక త్యాగగాథ దాగి ఉందని భక్తులు నమ్ముతారు. కాకతీయుల కాలంలో పగిడిద్దరాజు, గోవిందరాజుల మరణవార్త విని జంపన్న తన ప్రాణం శత్రువుల చేతికి చిక్కకుండా ఈ వాగులో దూకి వీరమరణం పొందాడట. రక్తంతో వాగు ఎర్రబడిందని అప్పటి నుంచి సంపెంగవాగు జంపన్నవాగుగా మారిందని కథనం. ఈ వాగులో స్నానం చేస్తే భయం తొలగి ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ముందుగా జంపన్నవాగులో స్నానం చేసి శుద్ధమైన మనసుతో అమ్మవార్లను దర్శిస్తారు. స్నానం చేయలేని వారు ఆ నీటిని చిలకరించుకుని వనదేవతలను దర్శించుకుంటారు. ఇది కేవలం నీటి స్నానం కాదు, త్యాగాన్ని గుర్తు చేసే ఆత్మశుద్ధి యాత్ర.

Medaram Jampanna Vagu History
Medaram Jampanna Vagu History
Share this post with your friends