Baijnath Mahadev Temple : భారతదేశంలో బ్రిటీషర్లు కట్టించిన ఏకైక దేవాలయం…మహాశివుడే స్వయంగా కాపాడినట్టు శాసనాలు

మధ్యప్రదేశ్‌లోని అగర్ మాల్వా జిల్లాలో ఉన్న బైజ్‌నాథ్ మహదేవ్ ఆలయం అద్భుతమైన చరిత్రకు ప్రతీక. 16వ శతాబ్దంలో నిర్మితమైన ఈ పురాతన శివాలయం 1883లో బ్రిటిష్ సైనికాధికారి లెఫ్టినెంట్ కల్నల్ మార్టిన్ దంపతుల చేత పునర్నిర్మించబడింది. అఫ్ఘాన్ యుద్ధానికి వెళ్లిన మార్టిన్ నుంచి సమాచారం లేకపోవడంతో ఆందోళన చెందిన ఆయన భార్య శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయానికి చేరుకుని 11 రోజుల పాటు ‘ఓం నమః శివాయ’ జపం చేసింది. పదో రోజున మార్టిన్ నుంచి లేఖ రావడం ఆమెను ఆశ్చర్యానికి గురి చేసింది. యుద్ధ భూమిలో త్రిశూలం పట్టిన యోగి తనను రక్షించాడని, అది శివుడేనని ఆయన పేర్కొన్నారు. కృతజ్ఞతగా 15,000 రూపాయల విరాళంతో ఆలయాన్ని పునర్నిర్మించారు. నేటికీ ఈ ఆలయం శివకృపకు సాక్ష్యంగా నిలుస్తోంది.

Baijnath mahadev temple story
Baijnath mahadev temple story
Share this post with your friends