వజ్ర కవచ పూజను ఎలా చేయాలంటే..

శ్రీ వేంకటేశ్వర స్వామివారి వజ్ర కవచ పూజను శనివారం నాడు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అది కూడా శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రంతో కలిసి వచ్చే శనివారం రోజున పూజ చేస్తే మరీ మంచిదట. ఈ రోజున కానీ ఈ పూజ చేస్తే ఫలితం ఊహించలేని విధంగా ఉంటుందట. ఏ సమయంలో ఈ పూజ చేయాలో కూడా తెలుసుకుందాం. శనివారం శుభ హోరలో అంటే ఉదయం 6 గంటల నుండి 8 గంటల మధ్య ఈ పూజ చేయడం సర్వ శ్రేష్టమని చెబుతారు. ఈ పూజ చేసేవారు ముందుగా కలశ స్థాపన చేయాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పటం ముందు ఒక రాగి పాత్రలో నీళ్లు పోసి, అందులో ఒక యాలక్కాయ, ఒక లవంగం, కొద్దిగా పచ్చ కర్పూరం, రెండు తులసి దళాలు వేయాలి.

వజ్ర కవచ పూజను ఎలా చేయాలంటే..
వజ్ర కవచ పూజను ఎలా చేయాలంటే..

ఈ వజ్ర కవచ పూజను ‘దీప కవచ పూజ’ అని కూడా అంటారు. ఈ పూజలో దీపారాధనకు ఉన్న ప్రాముఖ్యం వలన ఈ పేరు వచ్చింది. ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి, ఐదు వత్తులు వేసి దీపాన్ని వెలిగించి, ఈ దీపాన్ని స్వామికి చూపించి, ఈ దీపపు వెలుగులోనే స్వామి వారిని దర్శించాలి. ఈ వెలుగు మన కళ్లలోకి ప్రసరిస్తే దృష్టి దోషాలు తొలగిపోతాయి.
శ్రీవారి పాదాలపై తులసి దళాలు, పసుపు రంగు పూలు, అక్షింతలు వేస్తూ పూజను నిర్వహించాలి. పూజ సమయంలో శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రాన్ని 3, 5, 9 సార్లు లేదా 11 సార్లు భక్తి శ్రద్ధలతో పఠించాలి. అనంతరం కొబ్బరికాయ కొట్టి, చక్కర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం కర్పూర నీరాజనం ఇస్తే పూజ పూర్తైనట్టే. కలశంలోని నీటిని తీర్థంగా తీసుకుంటే అనారోగ్య సమస్యలన్నీ దూరమవుతాయి.

Share this post with your friends