దేవుళ్ల ఆలయాలతో పోలిస్తే దేవతల ఆలయాలు కాస్త తక్కువే. అయినా కూడా అమ్మవారి ఆలయాలు దాదాపు పవర్ ఫుల్. చూస్తేనే ఓ గాంభీర్యత, భక్తి భావం ఉట్టిపడేలా ఉంటాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హుగ్లీ జిల్లాలోని కొ్ని ప్రాంతాల్లో జగద్ధాత్రి దేవిని పూజిస్తారు. ప్రస్తుతం హుగ్లీ జిల్లాలోని చందన్నగర్ పట్టణంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం పెద్ద ఎత్తున పండుగ జరుగుతోంది. అమ్మవారు భారీ రూపంతో చూడటానికి అందంగా అద్బుతంగా కనిపిస్తారు. నాలుగు చేతులతో ఆయుధాలు చేతబూని అసుర సంహారం చేస్తున్నట్టుగా దర్శనమిస్తుంది.
జగద్ధాత్రి దేవి పూజను హుగ్లీ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ పండుగ సందర్భంగా జగద్ధాత్రి అమ్మవారు ‘బురిమా’ అవతారంలో భక్తులకు దర్శనిమిస్తుంది. ఈ సమయంలో అమ్మవారిని బెనారసీ చీరలతో అలంకరిస్తారు. భక్తులు సైతం అమ్మవారికి కానుకగా చీరలను సమర్పిస్తారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. అమ్మవారిని పురుషులు బెనారసీ చీరలను ధరించి దర్శించుకుంటారు. ఈ సంప్రదాయం ఈనాటిది కాదు.. 230 ఏళ్లుగా కొనసాగుతోంది. చందన్నగర్ పట్టణంలోని ప్రజలు అక్కడి హేమంతికా దేవతను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక్కడి అమ్మవారి విగ్రహం అత్యంత ఎత్తుగానూ.. భారీగా ఉంటుంది.