Site icon Bhakthi TV

శివరాత్రికి వనితా టీవీ స్పెషల్ సాంగ్.. 3 మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో..

మహాశివరాత్రి ఈ నెల 26న దేశమంతా జరుపుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ తరుణంలో వనితా టీవీ ప్రత్యేకంగా శివయ్య భక్తుల కోసం ఒక పాటను రూపొందించి భక్తుల కోసం ప్రోమోను విడుదల చేసింది. ప్రముఖ గాయకులు గోరేటి వెంకన్న, సినీ గాయకుడు రేవంత్ ఈ పాటను ఆలపించారు. ఈ భక్తి గీతం వింటుంటే.. మనసు ఆధ్యాత్మికత భావనకు గురవడం ఖాయం. ఆ పరమేశ్వరుడి జాడ తెలియక భక్తుడు ఆవేదనతో పాడుతున్న గేయమది. ఒకవైపు శివయ్య జాడ కనుక్కుంటూనే స్తుతిస్తూ సాగుతుంది.

‘దేవ దేవ శంకరా దేవ శంభో శంకర దేవులాడినేడ దొరకవా.. ఆది ఆది శంకర యాడ తిరుగుతున్నవు జాడ తెలవకున్నవేందిరా’ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతోంది. చరణ్ అర్జున్ అందించిన స్వరాలు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ప్రోమోనే ఇలా ఉంటే పూర్తి పాట ఎలా ఉంటుందోనని అంతా చర్చించుకుంటున్నారు. ఈ పాట శివరాత్రికి అన్ని దేవాలయాల్లోనూ మారుమోగడం ఖాయమని భక్తులు అంటున్నారు. దీనిని విడుదల చేసిన కొన్ని గంటల్లోనే దాదాపు మూడు మిలియన్ల వ్యూస్‌తో ట్రెండ్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఇప్పటి వరకూ వినకుంటే ఒకసారి వినండి.

Share this post with your friends
Exit mobile version