Site icon Bhakthi TV

దీపావళి నాడు ఏమేం మనకు కనిపిస్తే మంచిదో తెలుసా?

ప్రతీ ఏటా ఆశ్వీయుజ మాసంలో మనం దీపావళి పండుగను జరుపుకుంటాం. కుల, మతాలకు అతీతంగా ఈ పండుగను జరుపుకుంటాం. నరకాసురుడిని సత్యభామ వధించిన నాడు దీపావళిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పండుగను ఐదు రో జుల పాటు జరుపుకుంటారు. అయితే దీపావళి రోజున శ్రీ మహాలక్ష్మిని మనం పూజించుకుంటాం. అలాగే దీపావళి నాడు కొన్నింటిని చూస్తే మనకు చాలా మంచి జరుగుతుందని నమ్మకం. వాటిలో గుడ్లగూబ ఒకటి. దీపావళి నాడు మనకు గుడ్ల గూబ కనిపిస్తే లక్ష్మీ కటాక్షం తప్పక మనపై ఉంటుందట.

హిందూమతంలో ఆవును అత్యంత పవిత్రంగా భావించి పూజలు జరుపుకుంటూ ఉంటాం. ముఖ్యంగా దీపావళి నాడు గోమాత ఇంటికి వస్తే చాలా మంచిదట. ఈ రోజున పిల్లి కనిపించినా కూడా శుభమేనట. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుందట. గజరాజాన్ని శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు. దీపావళి రోజున ఏనుగును చూస్తే జీవితంలో మంచి మార్పు తధ్యమట. అలాగే చిట్టెలుక కనిపించినా కూడా శుభమేనట. చిట్టెలుక ఆదాయంలో పెరుగుదలకు సంకేతమట. కాబట్టి దీపావళి రోజున ఎలుక కనిపిస్తే డబ్బు రాకకు సూచనగా భావించి సంతోషించాలని పండితులు సూచిస్తున్నారు.

Share this post with your friends
Exit mobile version